Satyaraj: నా డియర్ ఫ్రెండ్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా మా సినిమా విడుదల

డైరెక్టర్ మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ మీద విజయ్ పాల్ రెడ్డి అడిదెల నిర్మిస్తున్న చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఈ మూవీకి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించారు. పాన్ ఇండియన్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కినచిత్రంలో వశిష్ట ఎన్ సింహా, సత్యం రాజేష్, ఉదయభాను, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ వంటి వారు ప్రధాన పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో.. సత్య రాజ్ మాట్లాడుతూ .. ‘‘మేమంతా కూడా మాదే మెయిన్ పాత్ర అని చెప్పుకోవచ్చు. కానీ ఇందులో కథే మెయిన్ హీరో. డైరెక్టర్ మోహన్, నిర్మాత విజయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజేష్ వీళ్లే అసలైన బాణాలు. ఈశ్వర్ గారు నాతో డ్యాన్స్ చేయించారు. డబ్బింగ్‌ చెప్పేటప్పుడు ఇతర సీన్లను కూడా అడిగి చూశాను. 70 ఏళ్లు దాటినా కూడా నేను కొత్త కొత్త పాత్రల్ని చేయాలని అనుకుంటున్నాను. రెగ్యులర్ పాత్రల్ని కాకుండా ‘బార్బరిక్’ లాంటి కొత్త పాత్రల్ని మరిన్ని చేయాలని అనుకుంటున్నాను. నా డియర్ ఫ్రెండ్ మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 22న ఈ చిత్రం విడుదల కాబోతోంది. చిరంజీవి గారు కంప్లీట్ యాక్టర్. ఆయన గొప్ప నటుడు, డ్యాన్సర్, అద్భుతమైన వ్యక్తి. మా మూవీ ఆయన పుట్టిన రోజున రిలీజ్ అవుతుండటం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

ఉదయ భాను మాట్లాడుతూ .. ‘‘నేనేమీ సినిమాలకు దూరంగా ఉండలేదు. నాకు నచ్చిన పాత్రలు వస్తేనే నటిస్తున్నాను. ఆర్టిస్టులకు ఉండే ఆకలిని తీర్చే పాత్రలో ప్రస్తుతం నటించాను. ‘బార్బిరిక్’ చిత్రంలో ఓ ఛాలెంజింగ్ పాత్రను మోహన్ గారు నాకు ఇచ్చారు. ప్రతీ పాత్రను నేను ప్రాణం పెట్టి పోషిస్తాను. నాకు రాజేష్ మంచి స్నేహితుడు. ఆయన ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా నన్ను కన్విన్స్ చేస్తుంటారు. మోహన్ గారు నెరేట్ చేసినప్పుడు ఆ కథ, ప్రతీ సీన్ నా కంటికి కనిపించింది. మన భాషలో ఇలాంటి చిత్రాలెందుకు రావు? అని అంతా అంటుంటారు. అలాంటి వారిని ఆశ్చర్యపరిచేలా మా చిత్రం ఉంటుంది. విజయ్ పాల్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఇలాంటి నిర్మాతలకు సక్సెస్ వస్తే ఇంకెంతో మందిని పైకి తీసుకు వస్తారు’’ అని అన్నారు.

వశిష్ట ఎన్ సింహా మాట్లాడుతూ .. ‘‘త్రిబాణధారి బార్బరిక్’ నాకెంతో ప్రత్యేకం. మోహన్ గారు చెప్పిన కథ విన్నప్పుడే టైటిల్ చాలా కొత్తగా అనిపించింది. కథ, స్క్రీన్ ప్లే చాలా బాగా అనిపించింది. ఇది చిన్న సినిమా అని మోహన్ నాకు ఓ కథ చెప్పారు. కానీ సెట్ మీదకు వచ్చిన తరువాత ఇది చిన్న సినిమా కాదని నాకు అర్థమైంది. ఇంత మంచి చిత్రాన్ని ఇచ్చిన మోహన్ గారికి థాంక్స్. ఇలాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. నన్ను ఈ మూవీలో చాలా కొత్తగా చూపించారు. ఇందులో ప్రతీ పాత్ర అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది. విజయ్ చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్. సత్య రాజ్‌ గారితో పని చేయడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు.

దర్శకుడు మోహన్ శ్రీవత్స మాట్లాడుతూ .. ‘‘కెమెరా అనే అస్త్రం ఉన్న మీడియానే మా చిత్రాన్ని ఆడియెన్స్ వరకు తీసుకెళ్లాలి. అందుకే మాకు మీడియానే ‘బార్బరిక్’. ‘నీ వల్లే నీ వల్లే’ అనే పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే మొదటి బాణం. ‘అనగా అనగా’ అనే పాట రెండో బాణం. ‘ఇస్కితడి ఉస్కితడి’ అంటూ మూడో బాణాన్ని వదిలాం’’ అని అన్నారు.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *