ఓటీటీలో విడుదలకు సిద్ధమైన సూపర్ హిట్ లీగల్ డ్రామా

అతిపెద్ద స్వదేశీ ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన జీ5.. ఇప్పటికే ఎన్నో తెలుగు సూపర్ హిట్ చిత్రాలను తన ప్రేక్షకులకు అందించింది. ఇప్పుడు మరో సూపర్ హిట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2025లో మరో సూపర్‌హిట్ ప్రీమియర్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన మాలీవుడ్ లీగల్ డ్రామా ‘J.S.K – జానకి V v/s స్టేట్ ఆఫ్ కేరళ’ తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో స్ట్రీమింగ్ కానుంది.

సురేష్ గోపి, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన J.S.K మూవీకి ప్రవీణ్ నారాయణన్ దర్శకత్వం వహించగా.. కాస్మోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై J.ఫణీంద్ర కుమార్ నిర్మించారు. ప్రఖ్యాత న్యాయవాది డేవిడ్ అబెల్ డోనోవన్ (సురేష్ గోపి) సహాయంతో లైంగిక వేధింపుల నుంచి బయటపడిన జానకి విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. న్యాయం కోసం పోరాడుతున్న ఓ యువతి, న్యాయవాది చివరకు గెలిచారా? లేదా? అసలు జానకి జీవితంలో ఏం జరిగింది? న్యాయం కోసం చేయాల్సి వచ్చిన పోరాటం ఏంటి? అనే ప్రశ్నల్ని లేవనెత్తేలా ట్రైలర్‌ను కట్ చేశారు. ఈ చిత్రంలో గిరీష్ నారాయణన్ స్వరపరిచిన పాటలు, గిబ్రాన్ అద్భుతమైన నేపథ్య సంగీతం స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. ఈ చిత్రానికి రెనదివే సినిమాటోగ్రఫీ అందించారు. ఈ ఆగస్టు 15న ‘J.S.K – జానకి V vs. స్టేట్ ఆఫ్ కేరళ’ ప్రత్యేక డిజిటల్ ప్రీమియర్‌ను ZEE5లో మాత్రమే చూడండి. ఈ స్వాతంత్ర్య దినోత్సవం, ఈ వీకెండ్‌ను ఉత్కంఠభరితమైన కోర్టు డ్రామాతో ఎంజాయ్ చేయండి.

ప్రజావాణి చీదిరాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *