పృధ్వీ వల్లే లైలా సినిమా చికుల్లో పడిందా??

సినిమా ఇండస్ట్రీలో ప్రతి సినిమా వెనుక ఎంతో మంది శ్రమ ఉంటోంది.

దర్శకుడు, నిర్మాత, నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కష్టపడతారు.

కానీ, కొన్ని సందర్భాల్లో కొందరు వ్యక్తులు అనవసరమైన వ్యాఖ్యలతో వివాదాలను రేకెత్తించి సినిమాపై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నారు.

ఇటీవల జరిగిన ‘లైలా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

ఈ ఈవెంట్‌లో రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలు చేయడం, వాటి ప్రభావం సినిమా మీద పడేలా ఉండటం వివాదానికి కారణమైంది.

చాలా కాలంగా సినీ ఫంక్షన్లు, సినిమా ప్రమోషన్‌ కోసం మాత్రమే ఉండేవి. కానీ, ఇటీవల రాజకీయ వ్యాఖ్యలు ఎక్కువగా వినిపించడం ప్రారంభమైంది.

ప్రముఖ చిత్రాలు అయిన ‘రిపబ్లిక్’, ‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్లలో కూడా రాజకీయ ప్రసంగాలు ప్రధానంగా మారాయి.

ఇప్పుడు అదే పరిస్థితి ‘లైలా’ సినిమా విషయంలోనూ కనిపిస్తోంది.

ఈవెంట్‌లో చేసిన కొన్ని వ్యాఖ్యలు ఓ వర్గాన్ని అసంతృప్తికి గురిచేశాయి.

ఈ కారణంగా సోషల్ మీడియాలో #BoycottLaila అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.

సినిమాపై రాజకీయ ప్రభావం పడటం వల్ల సినిమా టీమ్ కష్టపడి చేసిన ప్రయత్నం అర్థరహితం కావచ్చు.

ఇలాంటి పరిస్థితుల వల్ల, సినీ కార్యక్రమాల్లో రాజకీయాలు మాట్లాడాలా? సినిమా మాత్రమే మాట్లాడాలా? అనే ప్రశ్న మళ్లీ చర్చనీయాంశంగా మారుతోంది.

సంజు పిల్లలమర్రి

Also Read This : ఆ రెండురోజులు ఏడుస్తూనే ఉన్నా– విష్వక్‌సేన్‌

Vishwak Sen Exclusive Interview
Vishwak Sen Exclusive Interview

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *